రామ్ చరణ్, మహేష్ మల్టీస్టారర్

Thursday,January 05,2017 - 11:16 by Z_CLU

ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తే మల్టీస్టారర్ సెగ్మెంట్ లోనే సంచలనం అవుతుంది. పైగా ఈ స్టార్స్ మధ్య రియల్ లైఫ్ లో కూడా మంచి అండర్ స్టాండింగ్ ఉంది కాబట్టి, స్క్రీన్ షేర్ చేసుకోవడం పెద్ద ఇబ్బంది కాదు. అటు మహేష్ ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ ఇద్దరూ జాయింగ్ గా కోరుకుంటున్న కాంబినేషన్ ఇది. అయితే ఇప్పుడీ మల్టీస్టారర్ మాట స్వయంగా చరణ్ నోటి నుంచి రావడం గ్రేట్ న్యూస్.

ram_charan__mahesh_zee_cinemalu
అవును.. ఈమధ్య ఫ్యాన్స్ తో ఫేస్ బుక్ లో లైవ్ వీడియో ఛాట్ చేశాడు మెగా పవర్ స్టార్. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలిచ్చాడు. మహేష్ బాబుతో మల్టీస్టారర్ ఎప్పుడంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు చెర్రీ సమాధానం ఇచ్చాడు. మహేష్ తో కలిసి నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించాడు. మంచి కథ సెట్ అయితే, మహేష్ తో మూవీ గ్యారెంటీగా సెట్స్ పైకి వస్తుందని అంటున్నాడు. అంతేకాదు.. అద్భుతమైన స్టోరీలైన్ దొరికితే, మెగాస్టార్ చిరంజీవితో కూడా మల్టీస్టారర్ చేయడానికి రెడీ అంటున్నాడు మెగాపవర్ స్టార్.