రేపట్నుంచి నేను లోకల్ ఆడియో

Thursday,January 05,2017 - 10:20 by Z_CLU

ఈమధ్య ఆడియో ఫంక్షన్లు తగ్గిపోయాయి. పాటల్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం, లేదంటే ఎఫ్ఎం రేడియోల్లో విడుదల చేయడం కొత్తగా మొదలైంది. ఇప్పుడీ ట్రెండ్ ను నాని కూడా ఫాలో అవుతున్నాడు. తన రీసెంట్ మూవీ మజ్నుతో ఇప్పటికే ఈ ఫార్మాట్ లోకి వచ్చిన నేచురల్ స్టార్.. ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీ కోసం కూడా సోషల్ మీడియానే నమ్ముకున్నాడు. నాని నటించిన నేను లోకల్ మొదటి సాంగ్ రేపు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ కానుంది.

nenu-local
నెక్ట్స్ ఏంటి అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను దేవిశ్రీప్రసాాద్ కంపోజ్ చేశాడు. నాని-దేవిశ్రీ కాంబోలో ఇదే మొదటి సినిమా. నేను శైలజ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నటిస్తోంది. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. నేను లోకల్ సినిమాను వచ్చేనెల విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.