ఎక్కడ... ఎప్పుడు... ఎలా..?

Tuesday,November 15,2016 - 01:07 by Z_CLU

మహేష్ బాబు, మురుగదాస్ సినిమా లాంచ్ అయి దాదాపు ఐదు నెలలు గడిచిపోయింది. మధ్యలో మహేష్ బాబు బర్త్ డే కూడా వచ్చి వెళ్ళిపోయింది. చూస్తూండగానే దసరా, దీపావళి కూడా దాటేశాయి. రీసెంట్ గా కొరటాల శివతో నెక్స్ట్ సినిమా కూడా లాంచ్ అయింది. కానీ టైటిల్ ప్లేస్ లోనే ఇంకా క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది.

ఇప్పటివరకు మహేష్-మురుగదాస్ సినిమా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు టైటిల్ ను ప్రకటించలేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కొత్త టైటిల్స్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కానీ ఏదీ ఇప్పటివరకు ఫైనలైజ్ కాలేదు. ఏజెంట్ శివ, వాస్కోడీగామ, చట్టంతో పోరాటం లాంటి టైటిల్స్ రౌండ్స్ కొడుతూనే ఉన్నాయి. మరి ఎందుకు టైటిల్ ను ఎనౌన్స్ చేయడం లేదనేది పెద్ద ప్రశ్న.

rakul-preet-singh

తాజా సమాచారం ప్రకారం… మహేష్ బాబు కొత్త సినిమాకు సంబంధించి టీజర్ ఎడిటింగ్ స్టేజ్ లో ఉంది. ఈ టీజర్ కు సంబంధించి ప్రత్యేకంగా షూటింగ్ కూడా చేశారు. ఆ టీజర్ ఎడిటింగ్ కంప్లీట్ అయిన వెంటనే… దాంతో పాటు టైటిల్ ను ఎనౌన్స్  చేయాలని అనుకుంటున్నారు. అయితే దానికి ముహూర్తం ఏంటనేది మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు.