పవర్ ఫుల్ పోలీస్ పాత్రలు

Tuesday,November 15,2016 - 04:16 by Z_CLU

టాలీవుడ్ లో స్టార్స్ ఎలాంటి గెటప్స్ వేసినా, పోలీస్ గెటప్స్ తో వచ్చే ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ తో అలరించే మన స్టార్స్ పవర్ ఫుల్ పోలీస్ గెటప్స్ తో సిల్వర్ స్క్రీన్ పై సెగలు  పుట్టిస్తూనే ఉన్నారు.

nagachaitanya

 ప్రేమమ్ లాంటి రొమాంటిక్ హిట్ తరవాత “యాక్షన్ రొమాన్స్ కాంబినేషన్ లో తెరకెక్కిన “సాహసం శ్వాసగా సాగిపో” లో చివరికి పోలీస్ గెటప్ లో కనిపించి వీడేరా పోలీస్ అనిపించుకున్నాడు నాగచైతన్య. కెరీర్ లో నాగచైతన్య పోలీస్ గా కనిపించడం ఇదే ఫస్ట్ టైం

ramcharan

 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ‘ధృవ’ లో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్, మ్యాగ్జిమం టాలీవుడ్ ని షేక్ చేసేసింది. ఇక డిసెంబర్  నుండి థియేటర్లలో స్టైలిష్ పోలీస్ ఎన్ కౌంటర్ స్టార్ట్ అయినట్టే. తుపాన్ సినిమా తర్వాత చెర్రీ పోలీస్ గా నటించిన సినిమా ఇదే.

sai-dharnmtej

 సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది మొదలు రిలీజైన ప్రతి సినిమా సెన్సేషనే. రీసెంట్ గా రిలీజైనన నక్షత్రం ఫస్ట్ లుక్ తో ఆ సెన్సేషన్ కి ఇంకాస్త ఇంపాక్ట్ యాడ్ అయింది. కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు తేజు.

mahesh-_

పైకి పోకిరిలా కనిపించినప్పటికీ… పవర్ ఫుల్ పోలీస్ గా అదరగొట్టాడు మహేష్ బాబు. ఆ ఎంట్రీ ఇచ్చిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. అప్పటినుంచి పోలీస్ గెటప్ తో లవ్ లో పడిపోయిన సూపర్ స్టార్ దూకుడు, ఆగడు సినిమాల్లో కూడా పోలీస్ గెటప్స్ లో డిఫెరెంట్ మేనరిజంతో అలరించాడు.

pawan

 పోలీస్ గెటప్ తో పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ అందుకున్న సినిమా గబ్బర్ సింగ్. ఆ సినిమా సక్సెస్ తో… సేమ్ గెటప్ తో … వెంటనే “సర్దార్ గబ్బర్ సింగ్” గా కూడా కనిపించి మెప్పించాడు పవర్ స్టార్. గతంలో కొమరం పులి సినిమాలో పవన్ పోలీస్ గా కనిపించాడు.

ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఖాకీ చొక్కాతో మెరుపులు మెరిపించాడు. టెంపర్, బాద్ షా సినిమాల్లో ఎన్టీఆర్ పోలీస్ గెటప్ మనల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తుంది. మరీ ముఖ్యంగా టెంపర్ సినిమాలో యూజర్ నేమ్ దయ.. పాస్ వర్డ్ పోలీస్ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ కిర్రాక్.

venkatesh

 వెంకటేష్ కరియర్ లో ఎన్ని సినిమాల్లో పోలీస్ గెటప్స్ వేసిన రీసెంట్ గా రిలీజ్ అయిన “ బాబు బంగారం” అన్ని సినిమాల్లో స్పెషల్. పోలీస్ గెటప్ అంటేనే సీరియస్ గా, మ్యాన్లీగా కనిపించే వెంకీ, ఈ సినిమాలో అతిగా జాలిపడే క్యారెక్టరైజేషన్ తో ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు నవ్విస్తూనే ఉంటాడు.  వీటితో పాటు సూపర్ పోలీస్, ఘర్షణ లాంటి సినిమాల్లో కూడా వెంకటేశ్ పోలీస్ గా మెప్పించాడు.