Mahesh-Sandeep Vanga - కలిశారు కానీ..!

Saturday,March 13,2021 - 12:54 by Z_CLU

మహేష్ బాబు, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో సినిమా వస్తుందని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాళ్ల మధ్య గతంలో స్టోరీ డిస్కషన్లు కూడా జరిగాయి. కానీ మూవీ మాత్రం ఫైనలైజ్ అవ్వలేదు.

అయితే ఈ గ్యాప్ లో Mahesh-Sandeep Vanga కలిశారు. అయితే వీళ్లు కలిసింది సినిమా కోసం కాదు. ఓ యాడ్ కోసం. ఓ టెలివిజన్ యాడ్ లో నటించనున్న మహేష్ ను సందీప్ డైరక్ట్ చేయబోతున్నాడు. కేవలం ఒకే ఒక్క రోజు ఈ షూటింగ్ జరగనుంది.

ప్రస్తుతం సర్కారువారి పాట చేస్తున్నాడు మహేష్. అటు రణబీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమా చేస్తున్నాడు సందీప్ రెడ్డి. ఈ యాడ్ షూట్ తర్వాతైనా సందీప్ కు మహేష్ ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.