Wild Dog - నాగ్ మూవీ ఎట్రాక్షన్స్ ఇవే

Saturday,March 13,2021 - 01:00 by Z_CLU

నాగార్జున హీరోగా రాబోతున్న యాక్షన్ మూవీ వైల్డ్ డాగ్. సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 2న రాబోతున్న ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బయటకొచ్చాయి.

 70 రోజుల్లో వైల్డ్ డాగ్ షూటింగ్ పూర్తిచేశారు. ఈ 70 రోజుల్లో ఏకంగా 300 లొకేషన్లు కవర్ చేశారు.

 యూనిట్ షూట్ చేసిన లొకేషన్లలో జీరో డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్న ప్రాంతాలు కూడా ఉన్నాయి.

లాక్ డౌన్ లో కూడా వైల్డ్ డాగ్ షూటింగ్ చేశారు.

వైల్డ్ డాగ్ లొకేషన్లలో 13వేల అడుగుల ఎత్తున ఉన్న ప్రాంతాలు కూడా ఉన్నాయి

ఎన్ఐఏ ఆఫీసర్స్ బాడీ లాంగ్వేజ్ కోసం సెట్స్ లో ఓ ఆర్మీ ఆఫీసర్ ను కూడా పెట్టుకున్నారు.

హైదరాబాద్ బాంబ్ పేలుళ్ల ఆధారంగా వైల్డ్ డాగ్ తెరకెక్కింది.

లాక్ డౌన్ తర్వాత తొలిసారి సెట్స్ పైకొచ్చిన సీనియర్ హీరోగా ఈ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు నాగ్.

మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా ట్రయిలర్ ను లాంఛ్ చేశారు.

ఈ సినిమాతో దియా మీర్జా టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తోంది

అహిషోర్ సోలమన్ (వంశీ పైడిపల్లి శిష్యుడు) ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు.