F3 Movie బుల్లితెరపై నవ్వులే నవ్వులే

Wednesday,September 14,2022 - 06:05 by Z_CLU

విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో డబ్బు ఉన్న వాడికి ఫన్, లేని వాడికి ఫ్రస్ట్రేషన్ అనే కాన్సెప్ట్ తో అనిల్ రావిపూడి తెరకెక్కిన ఫన్ డోస్ మూవీ ‘F3’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అయింది. సిల్వర్ స్క్రీన్ పై నవ్వుల పూవులు పూయించిన ఈ సినిమా  బుల్లితెరపై ఎంటర్టైన్ చేసేందుకు రానుంది. సెప్టెంబర్ 18న ఆదివారం సాయంత్రం 6గంటలకు జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ గా రాబోతుంది.

F2 కి సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమా థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించి నవ్వించి మంచి వసూళ్ళు దక్కించుకుంది. ఇప్పుడు టివీ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించేందుకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా వస్తోంది.

వెంకటేష్ , వరుణ్ తేజ్ హిలేరియస్ కామెడీ , చక్కిలిగింతలు పెట్టే కామెడీ సీన్స్ , దేవి పాటలు , అనిల్ రావిపూడి సృష్టించిన కామిక్ పాత్రలతో సినిమా ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తూ మెప్పించడం ఖాయం.  మీ ఫ్రస్ట్రేషన్ దూరం చేసి ఫుల్ ఫన్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చెయ్యడానికి మీ ముందుకు వస్తుంది F3గ్యాంగ్. DONT MISS IT

F3 World Television Premiere On September 18th Sunday Evening 6pm Only On Zee Telugu