మహేష్ కెరీర్ లోనే ఫస్ట్ టైం....

Saturday,September 10,2016 - 11:43 by Z_CLU

 

 

మహేష్ తన ప్రతి సినిమాకు తానే డబ్బింగ్ చెప్తుంటాడు కదా…? నిజమే మహేష్ ఇప్పటి వరకూ నటించిన తెలుగు సినిమాలన్నిటికీ స్వయంగా తనే డబ్బింగ్ చెప్పాడు. కానీ ప్రస్తుతం మహేష్ ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం లో నటిస్తున్న చిత్రం కోసం తొలిసారి తమిళ్ లో డబ్బింగ్ చెప్పనున్నాడట. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు మురుగదాస్ తెలియజేశాడు. ప్రస్తుతం చెన్నై లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని బయటపెట్టాడు దర్శకుడు. ఇక మహేష్ సెట్ లో కూడా తమిళ్ డైలాగ్స్ బాగా చెప్తున్నాడని తెలిపాడు మురుగదాస్. అంతేకాదు ఈ సినిమాతో స్వయంగా తానే తమిళ్ డబ్బింగ్ కూడా చెప్పనున్నాడని స్పష్టం చేసాడు దర్శకుడు. అయితే మహేష్ నటించిన శ్రీమంతుడు తమిళ్ లో కూడా విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే కోలీవుడ్ లో అడుగుపెట్టాడు సూపర్ స్టార్ కానీ ఈ సినిమాకు తమిళ్ లో మహేష్ డబ్బింగ్ చెప్పలేదు. మహేష్ పుట్టి పెరిగింది చెన్నై లోనే కాబట్టి తమిళ్ స్పష్ఠంగా మాట్లాడగలడు. అందుకే దర్శకుడు మురుగదాస్ మహేష్ తోనే తమిళ్ డబ్బింగ్ కూడా చెప్పించాలని డిసైడ్ అయ్యాడట. ఇందుకు మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.