కొడితే కొట్టాలి.. హ్యాట్రిక్ కొట్టాలి....

Saturday,September 10,2016 - 03:00 by Z_CLU

 

కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అనేది చిరంజీవి ఫేమస్ సాంగ్. కానీ ఇప్పుడు హీరోలంతా ఈ సాంగ్ ను మార్చేశారు. కొడితే కొట్టాలిరా హ్యాట్రిక్ కొట్టాలి అంటున్నారు. స్లంప్ లో ఉన్న టాలీవుడ్ కు ఆక్సిజన్ అందించేందుకు కొంతమంది హీరోలు హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నారు. ఒక హిట్ కొట్టడమే కష్టమనుకుంటున్న ఈ రోజుల్లో… వరుసగా మూడు హిట్స్ తో దూసుకుపోతున్నారు.

ntr-solo-still

హాట్రిక్ హీరోల్లో ముందుగా చెప్పుకోవాల్సింది ఎన్టీఆర్ గురించే. టెంపర్ ముందు వరకు కెరీర్ పరంగా తారక్ కాస్త ఇబ్బంది పడ్డాడు. కానీ టెంపర్ నుంచి యంగ్ టైగర్ కు ఆకాశమే హద్దుగా మారింది. టెంపర్ హిట్ తర్వాత… నాన్నకు ప్రేమతో సినిమా చేశాడు. అది కూడా సూపర్ సక్సెస్ అయింది. తాజాగా ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ కూడా రికార్డు వసూళ్లతో థియేటర్లలో నడుస్తోంది.

bunny-still

మెగా కాంపౌండ్ నుంచి ఈమధ్య కాలంలో హ్యాట్రిక్ అందుకున్న హీరో బన్నీ. అవును.. రేసుగుర్రం నుంచి అల్లు అర్జున్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. ఆ సినిమా తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి సినిమా చేశాడు. అది కూడా సూపర్ హిట్ అయింది. తాజాగా సరైనోడు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు బన్నీ.

nag-solo

ఇక అక్కినేని వంశంలో కూడా హ్యాట్రిక్ హీరో ఉన్నాడు. అతడే ఒన్ అండ్ ఓన్లీ కింగ్ నాగార్జున, మనం సినిమా నుంచి వరుసగా హిట్స్ కొడుతున్నాడు నాగ్. మనం సినిమా తర్వాత సంక్రాంతి కానుకగా సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో వచ్చాడు. ఆ సినిమా కూడా పెద్ద హిట్. ఆ తర్వాత ఊపిరి లాంటి ప్రయోగాత్మక సినిమాతో కూడా సక్సెస్ అందుకున్నాడు మన్మధుడు.

nani-solo

ఈ హీరోలతో పాటు నాని కూడా హ్యాట్రిక్ లిస్ట్ లో ఉన్నాడు. ఆమధ్య వరుసగా ఫ్లాపులు తెచ్చుకున్న ఈ నేచురల్ స్టార్… భలే భలేమగాడివోయ్ సినిమా నుంచి స్వింగ్ లోకి వచ్చేశాడు. ఆ సినిమా తర్వాత కృష్ణగాడి వీరప్రేమగాథతో మరో సక్సెస్ కొట్టాడు. తాజాగా జెంటిల్ మెన్ విజయంతో తను కూడా హ్యాట్రిక్ హీరోల జాబితాలోకి చేరిపోయాడు.