చరిత్ర సృష్టించిన మహేష్

Thursday,November 10,2016 - 10:53 by Z_CLU

మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకి ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ అవ్వలేదు. అప్పుడే ఇంకో సినిమా సెట్స్ పైకి వచ్చేసింది. నిన్న మొన్నటి వరకు జస్ట్ న్యూస్ గా చక్కర్లు కొట్టిన కొరటాల శివ, మహేష్ బాబు సినిమా అఫీషియల్ గా లాంచ్ అయింది.

కథల సెలెక్షన్ లో చాలా కేరింగ్ గా ఉండే మహేష్ బాబు తీరిగ్గా టైం తీసుకుని మరీ డెసిషన్స్ తీసుకుంటాడు. అలాంటిది ఓ వైపు మురుగదాస్ తో సినిమా సెట్స్ పై ఉండగానే కొరటాలతో నెక్స్ట్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చరిత్ర సృష్టించాడు. ఈమధ్య కాలంలో ఓ సినిమా సెట్స్ పై ఉంటుండగానే మరో సినిమాను ఎప్పుడూ ప్రారంభించలేదు మహేష్. ఒక విధంగా చెప్పాలంటే స్టార్ డమ్ వచ్చిన తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి. అందుకే మహేష్ చరిత్ర సృష్టించాడంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మొదలైంది.

మహేష్ బాబు తో మరో నీట్ అండ్ క్లీన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ని ప్లాన్ చేస్తున్న కొరటాల శివ, జనవరి లాస్ట్ వీక్ కల్లా సినిమాని సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. వచ్చే ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ లో ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.