హ్యాపీ బర్త్ డే

Thursday,November 10,2016 - 11:18 by Z_CLU

రాధాకృష్ణ జాగర్లమూడి అసలు పేరైనా, క్రిష్ అంటేనే అందరికీ తెలుసు. నవంబర్ 10, 1977 లో పుట్టిన క్రిష్ ఈ రోజు తన 39 వ పుట్టినరోజును GPS యూనిట్ మధ్య గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. గమ్యంతో తన సినిమా కరియర్ కి డిఫెరెంట్ ట్రాక్ ని క్రియేట్ చేసుకున్న క్రిష్, జయాపజయాలతో సంబంధం లేకుండా తన మార్క్ సినిమాలను తెరకెక్కిస్తూనే ఉన్నాడు.

cw39srvveaazmdp

ప్రస్తుతం చారిత్రాత్మక కథాంశంతో తెరకెక్కుతున్న బాలయ్య 100 వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ కి డైరెక్షన్ చేస్తున్న క్రిష్.. త్వరలో అక్షయ్ కుమార్ హీరోగా మరో హిందీ సినిమా తీయబోతున్నాడట. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న క్రిష్… మరిన్ని మంచి సినిమాలు తీయాలని జీ-సినిమాలు మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. హ్యాపీ బర్త్ డే క్రిష్.