Mahesh Movies: కెరీర్ బెస్ట్ సినిమాలివే

Sunday,August 09,2020 - 04:46 by Z_CLU

ఈరోజు మహేష్ తన 45వ పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడి కెరీర్ పై సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. Mahesh Movies లో ది బెస్ట్ మూవీస్ ఏంటనే చర్చ హాట్ హాట్ గా నడుస్తోంది. నెటిజన్ల అభిప్రాయం ప్రకారం Mahesh Babu Career లో Best Movies ఇవే.

1. ఒక్కడు (Okkadu)
2. అతడు (Athadu)
3. పోకిరి (Poiri)
4. 1-నేనొక్కడినే (1-Nenokkadine)
5. శ్రీమంతుడు (Srimanthudu)

నిజానికి Mahesh Babu filmography లో ఇవి మాత్రమే కాదు.. భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు, మహర్షి, మురారి లాంటి సూపర్ హిట్స్ కూడా ఉన్నాయి. కానీ ఎందుకో నెటిజన్లు మాత్రం ఎక్కువగా పైన చెప్పుకున్న 5 సినిమాలకే ఓటేశారు.

ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే.. 1-Nenokkadine సినిమా మహేష్ కెరీర్ లో ఏమంత పెద్ద హిట్ కాదు. బాక్సాఫీస్ వద్ద అది హిట్టవ్వకపోయినా.. ఆ తర్వాత కాలంలో ఆడియన్స్ కు అది బాగా కనెక్ట్ అయింది.