ఒకేసారి ఇద్దర్ని సెట్ చేసిన మాస్ రాజా

Sunday,August 09,2020 - 06:02 by Z_CLU

మాస్ రాజా కొత్త సినిమా ఇప్పుడిప్పుడే ఓ షేప్ తీసుకుంటోంది. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ చేయబోయే కొత్త సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రీన్ ప్లే లాక్ చేశారు. ఇప్పుడు హీరోయిన్లను కూడా ఫిక్స్ చేశారు.

Raviteja-RameshVarma మూవీలో హీరోయిన్లగా రాశి ఖన్నా, నిధి అగర్వాల్ ను ఆల్ మోస్ట్ ఫిక్స్ చేశారు. రేపోమాపో అపీషియల్ గా ఎనౌన్స్ చేయబోతున్నారు. వీళ్లలో రాశిఖన్నాకు ఇంతకుముందే రవితేజతో వర్క్ చేసిన ఎక్స్ పీరియన్స్ ఉంది.

ఇక వీళ్లలో ఫస్ట్ హీరోయిన్ ఎవరు.. సెకెండ్ లీడ్ ఎవరనే డిస్కషన్ అక్కర్లేదంటున్నారు. ఎందుకంటే కథ వీళ్లిద్దర్నీ డిమాండ్ చేస్తోందట. ఫస్టాఫ్ లో ఒకరు లీడ్ తీసుకుంటే, సెకండాఫ్ లో మరొకరి డామినేషన్ ఉంటుందట.

Krack Movie కొలిక్కివచ్చిన వెంటనే రవితేజ-రమేష్ వర్మ కాంబోపై మరింత క్లారిటీ వస్తుంది.