నైజాంలో 10 కోట్ల మార్క్ టచ్ చేసిన మహానటి

Tuesday,May 29,2018 - 07:01 by Z_CLU

ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన మహానటి మరో రికార్డు క్రియేట్ చేసింది. ఓవర్సీస్ లో ఇప్పటికే 2.5 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరి సంచలనం సృష్టించిన ఈ సినిమా.. తాజాగా నైజాంలో 10 కోట్ల షేర్ టచ్ చేసింది. ఓ ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ 10 కోట్ల రూపాయల షేర్ రాబట్టడం ఇదే ఫస్ట్ టైం.

అంతేకాదు.. నైజాంలో ఈ ఏడాది 10 కోట్ల మార్క్ చేసిన సినిమాలో రంగస్థలం, భరత్ అనే నేను సినిమా తర్వాత మహానటి మూడో స్థానంలో నిలిచింది. అలా ఈ ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది మహానటి.

మరోవైపు ఈ సినిమాకు సంబంధించి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్న డీలీటెడ్ సీన్స్ తో మహానటిపై క్రేజ్ మరింత పెరుగుతోంది. రిపీట్ ఆడియన్స్ పెరుగుతుండడంతో 3 వారాలైనా ఈ సినిమాకు ఆక్యుపెన్సీ తగ్గలేదు. రేపటితో ఈ సినిమా 3 వారాలు కంప్లీట్ చేసుకోబోతోంది.