Macherla Action Dhamki యాక్షన్ గ్లిమ్స్ అదిరింది

Tuesday,July 26,2022 - 01:31 by Z_CLU

‘Macherla Action Dhamki’ from Macherla Niyojakavargam Released

 హీరో నితిన్ మోస్ట్ అవైటెడ్ మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ క్యురియాసిటీని పెంచుతోంది. ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్స్ లో దూకుడు పెంచిన చిత్ర యూనిట్ .. మాచర్ల యాక్షన్ ధమ్కీని అంటూ యాక్షన్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు.

పర్ఫెక్ట్ మాస్ ఎంటర్‌టైనర్‌కి సంబంధించిన అన్ని పాజిటివ్‌ ఎలిమెంట్స్ చూపించే ఓ యాక్షన్ సీక్వెన్స్ గ్లిమ్స్ తో చూపించారు. మాచర్ల యాక్షన్ ధమ్కీ లో నితిన్ పవర్ ఫుల్ డైలాగ్, గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్,  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలరించాయి.

మహాభారతంలో ధర్మాన్ని కాపాడటం కోసం లక్షలాది మంది తమ సమాధులను పునాధులుగా వేశారు.. మాచర్ల నియోజక వర్గంలో ధర్మాన్ని కాపాడటానికి నా సమాధిని పునాదిగా వెయ్యడానికి… నేను సిద్ధం‘అని నితిన్ చెప్పిన డైలాగ్ హీరో పాత్రని ఎస్టాబ్లెస్ చేయడమే కాకుండా సినిమాపై మరింత క్యూరీయాసిటీని పెంచింది.

ఈ నెల 30న గుంటూరులో జరిగే భారీ పబ్లిక్ ఈవెంట్‌లో ‘మాచర్ల నియోజకవర్గం’ థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేయనున్నారు. మాచర్ల నియోజకవర్గంను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి భారీ నిర్మిస్తున్నారు. నితిన్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రమిది. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి స్పెషల్ నంబర్‌ రారా రెడ్డిలో సందడి చేయనుంది.  మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆగస్ట్ 12న సినిమా థియేటర్స్ లోకి రానుంది.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics