Bimbisara కళ్యాణ్ రామ్ కోసం మరోసారి ఎన్టీఆర్ !

Tuesday,July 26,2022 - 01:54 by Z_CLU

NTR as Chief Guest for KalyanRam’s ‘Bimbisara’ Pre Release Event

కళ్యాణ్ రామ్ హీరోగా వసిష్ట దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘బింబిసార’ ఆగస్ట్ 5న గ్రాండ్ గా రిలీజ్ అవ్వనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్స్ కోసం కళ్యాణ్ రామ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగా గ్రాండియర్ విజువల్స్ తో పీరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి జులై 29న హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబో తున్నారు.

ఈ ఈవెంట్ కి కళ్యాణ్ రామ్ సోదరుడు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు. ఈ విషయాన్ని ఓ గ్లిమ్స్ వీడియో ద్వారా ఎనౌన్స్ చేశారు. గతంలో కళ్యాణ్ రామ్ సినిమాల ఈవెంట్స్ కి చాలా సార్లు వచ్చాడు ఎన్టీఆర్.  ఇప్పుడు కళ్యాణ్ రామ్ కోసం మరో సారి స్పెషల్ గెస్ట్ గా మారాడు తారక్. ‘ఆర్ ఆర్ ఆర్’ రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ మీడియా ముందుకు రాలేదు. ఎక్కడా కనిపించలేదు. అందుకే ఈ ఈవెంట్ లో తారక్ ని చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

చీఫ్ గెస్ట్ గా వచ్చి ఎన్టీఆర్ ‘బింబిసార’ గురించి అలాగే కళ్యాణ్ రామ్ డెడికేషన్ గురించి చెప్పబోతున్నాడు. ఇదే వేదికపై  దర్శకుడు వసిష్ట తో  తన సినిమా కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. ఇటివలే కళ్యాణ్ రామ్  దర్శకుడు వసిష్ట ఇద్దరూ ఎన్టీఆర్ కోసం కథా చర్చలు జరిపారు. మరి చూడాలి బింబిసార ఈవెంట్ లో ఎన్టీఆర్ ఏం చెప్తాడో ?

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics