SIta Ramam ఇంట్రెస్టింగ్ ట్రైలర్

Tuesday,July 26,2022 - 12:14 by Z_CLU

Dulquer Salman’s ‘Sita Ramam’ Trailer was Impressive

అనాధ సోల్జర్ కి ఓ అందమైన అమ్మాయి లేఖ రాస్తే ? ఆమెతో అతను ప్రేమలో పడితే ? అనే స్టోరీ లైన్ తో తెరకెక్కిన ‘సీతారామం’ ఆగస్ట్ 5న రిలీజ్ అవ్వబోతుంది. సినిమా కథేంటో ఇప్పటికే టీజర్ తో చెప్పేసిన మేకర్ తాజాగా ట్రైలర్ తో సినిమాపై మరింత ఆసక్తి కలిగిస్తూ  అంచనాలు పెంచేశారు.

2 : 27 సెకన్ల నిడివితో కట్ చేసిన ట్రైలర్ లో విజువల్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , కేరెక్టర్స్ ఎట్రాక్ట్ చేశాయి. అయితే అందరూ ఊహించినట్టు ఇది కేవలం ప్రేమ కథతో తెరకెక్కిన సినిమా కాదని, ఇందులో ఓ సీరియస్ పాయింట్ ఉందని ట్రైలర్ లో చెప్పారు. అసలు రామ్ ఎవరు ? అతనికి సీత ఎందుకు ఉత్తరం రాసింది ? అసలు సీత ఎవరు ఆమె కథేంటి ? ఇలా ట్రైలర్ లో చాలా లాక్స్ వేసి సినిమా చూసి వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవాలని చూపించారు.

హనువపూడి సెన్సిబుల్ డైరెక్టర్. అతని సినిమాలకు ఓ సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి దర్శకుడి నుండి వస్తున్న ఈ సినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టే హను కూడా ఈ సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ‘అందాల రాక్షసి’ తర్వాత మళ్ళీ తన మనసులో నుంచి పుట్టిన ఓ అందమైన కథ ‘సీతా రామం’ అని చెప్తున్నాడు. ఈ ప్రేమకథలో దుల్కర్ సరసన మృణాలిని ని హీరోయిన్ గా తీసుకొని ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేశాడు. సంగీత దర్శకుడు విశాల్ చంద్ర శేఖర్ నుండి సినిమాకు కావలసిన మంచి వినసొంపైన పాటలు అందుకున్నాడు. ఇప్పటికే సాంగ్స్ , ట్రైలర్ సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ ఆడియన్స్ లో కలిగిస్తున్నాయి.

స్వప్న సినిమాస్ కూడా మంచి కథలు ఎంచుకుంటారు. ఇవన్నీ కలిసి  యుద్ధంతో రాసిన ప్రేమకథ ను హిట్ చేసేలా ఉన్నాయి. ప్రముఖ అగ్ర నిర్మాత  అశ్వనిదత్ నిర్మించిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా సినిమాలో రష్మిక , సుమంత్ , భూమిక , తరుణ్ భాస్కర్ కీ రోల్స్ లో కనిపించనున్నారు.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics