F3 పార్టీ సాంగ్ సూపర్బ్

Tuesday,May 17,2022 - 07:05 by Z_CLU

Life Ante Itta Vundaala Lyrical from F3 is out !

విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన F3 నుండి స్పెషల్ సాంగ్ రిలీజైంది. ఇప్పటికే ప్రోమోతో ఎట్రాక్ట్ చేసి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ పార్టీ సాంగ్ ప్రస్తుతం మ్యూజిక్ లవర్స్ నుండి కాంప్లిమెంట్స్ అందుకుంటోంది. “అధ్యక్షా లైఫ్ అంటే ఇట్టా ఉండాలా” అనే లిరిక్ తో స్టార్ట్ అయ్యే ఈ సాంగ్ కి అదిరిపోయే ఎనర్జిటిక్ ట్యూన్ కంపోజ్ చేశాడు దేవి శ్రీ ప్రసాద్. దేవి స్పెషల్ ట్యూన్ కి క్యాచీ లిరిక్స్ అందించాడు కాసర్ల శ్యామ్.

 ఈ సాంగ్ థియేటర్స్ లో ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ ఇస్తుందని లిరికల్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా పూజ హెగ్డే గ్లామర్ షో సాంగ్ కి స్పెషల్ ఎట్రాక్షన్ అవ్వనుంది.  వెంకీ వరుణ్ లతో పూజ హాట్ స్టెప్స్ కనువిందు చేయనున్నాయి. రాహుల్ సిప్లిగంజ్ , గీత మాధురి సింగింగ్ కూడా సాంగ్ కి ప్లస్ అయింది. ఈ సాంగ్ షూట్ కి విచ్చేసిన ప్రముఖుల క్లిప్స్ కూడా లిరికల్ వీడియోలో యాడ్ చేశారు. అలాగే ఈ సాంగ్ లో దర్శకుడు అనీల్ రావిపూడి స్పెషల్ అప్పిరియన్స్ ఇచ్చిన విజువల్ కూడా చూపించారు.

ప్రస్తుతం F3 పార్టీ సాంగ్ సోషల్ మీడియాలో హంగామా చేస్తూ భారీ వ్యూస్ వైపు దూసుకెళ్తోంది. దిల్ రాజు సమర్పణలో  శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా , మెహ్రీన్ , హీరోయిన్స్ నటిస్తుండగా సునీల్ , రాజేంద్ర ప్రసాద్ , సోనాల్ చౌహాన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మే 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics