NTR30 ఫస్ట్ లుక్ రెడీ ?

Wednesday,May 18,2022 - 11:13 by Z_CLU

‘NTR30’ First look on the way ?

ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NTR30 సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటికొచ్చింది. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా దర్శకుడు కొరటాల శివ ఫస్ట్ లుక్ ప్లాన్ చేస్తున్నారనేది అప్ డేట్. ఇంకా మేకర్స్ అఫీషియల్ గా చెప్పలేదు కానీ ఇటివలే ఎన్టీఆర్ కి లుక్ లాక్ చేసి ఫోటో షూట్ చేశారని సమాచారం. ఆ స్టిల్ తారక్ లుక్ రివీల్ చేసి తో బర్త్ డే పోస్టర్ రెడీ చేయిస్తున్నాడట కొరటాల.

‘ఆచార్య’ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ పుట్టిన రోజు వస్తుంది కదా అప్ డేట్ ఉంటుంది అన్నట్టుగా మీడియాతో చెప్పుకున్నాడు కొరటాల. ప్రస్తుతం అదే ప్లానింగ్ లో ఉన్నాడు. ఎన్టీఆర్ బర్త్ డే కి స్పెషల్ పోస్టర్ వదిలి సినిమా అప్ డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ని ఖుషి చేయబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా త్వరలోనే లాంచ్ కానుంది.

యువ సుధా ఆర్ట్స్ బేనర్ పై మిక్కిలినేని సుధాకర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ పై కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నాడని టాక్. ఇంకా ఎన్టీఆర్ కి  హీరోయిన్ ఫైనల్ అవ్వలేదు. త్వరలోనే మేకర్స్ హీరోయిన్ తో పాటు మిగతా కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ ఎనౌన్స్ చేయనున్నారు.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics