Adipurush - ప్రభాస్ తో మహేష్ హీరోయిన్

Sunday,October 18,2020 - 12:28 by Z_CLU

Prabhas 22వ చిత్రంగా తెరకెక్కనున్న ‘Adipurush’ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో సీత పాత్రలో నటించబోయే హీరోయిన్ ఇంకా ఫైనల్ అవలేదు. ఇప్పటికే కొంత మంది హీరోయిన్స్ ను లిస్టు అవుట్ చేస్తున్న మేకర్స్ ప్రస్తుతం ఈ రోల్ కి Kriti Sanan ను సంప్రదించినట్లు సమాచారం.

కృతి తెలుగులో Mahesh 1-Nenokkadine ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత నాగ చైతన్య ‘దోచెయ్’ సినిమాలో నటించింది. సో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమున్న హీరోయిన్ కావడంతో మేకర్స్ kritiకే ఓటు వేయనున్నారని తెలుస్తుంది. మరి ఈ విషయంపై క్లారిటీ రావాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాలి.