Adipurush - ప్రభాస్ సినిమాకు కొత్త రిలీజ్ డేట్

Tuesday,March 01,2022 - 12:44 by Z_CLU

Prabhas’s Adipurush to release on January 12, 2023

రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా టి-సిరీస్, రెట్రో ఫైల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నయ్యర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణ్ గా నటిస్తున్నాడు

చెడుపై మంచి గెలిచే యుద్ధం అంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. జనవరి 12, 2023 సంక్రాంతి సందర్భంగా ఆదిపురుష్ సినిమాను 3డిలో విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది.

రామాయణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ఓం రౌత్. భారీ బడ్జెట్‌తో ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడనటువంటి అత్యద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్స్‌కు మంచి అప్లాజ్ వచ్చింది. నిజానికి ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్ట్ లో విడుదల చేయాలనుకున్నారు. ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు ఎనౌన్స్ చేశారు.

ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీని వాడుకున్నారు మేకర్స్. ప్రపంచంలోని అత్యున్నత సాంకేతిక నిపుణులు ఆదిపురుష్ కోసం పని చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

Kriti Sanon opposite Prabhas in Adipurush

నటీనటులు:
ప్రభాస్, కృతి సనన్, సన్నీ సింగ్, సైఫ్ అలీ ఖాన్ తదితరులు

టెక్నికల్ టీమ్:
దర్శకుడు: ఓం రౌత్
నిర్మాతలు: భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నయ్యర్
సంగీతం: సచేత్ – పరంపర
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఫళణి
ఎడిటర్: అపూర్వ మోటివాలే, ఆశిష్ మహత్రే

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics