పాత పద్దతిలో RaviTeja

Sunday,October 18,2020 - 12:22 by Z_CLU

కొన్నేళ్ళ క్రితం Raviteja నుండి ఏడాదికి రెండు మూడు సినిమాలొచ్చేవి. ఏడాదికి 5 సినిమాలొచ్చిన సందర్భాలూ ఉన్నాయి. రెండు సినిమాలు మాత్రం గ్యారెంటీగా విడుదలయ్యేవి. అయితే ఇటివలే స్పీడ్ తగ్గించి సినిమాలు చేస్తున్నాడు రవితేజ. ‘అమర్ అక్బర్ ఆంటోని’ తర్వాత కొంత గ్యాప్ కూడా తీసుకున్నాడు.

ఇప్పుడు మళ్ళీ స్పీడు పెంచి సినిమాలు ఫైనల్ చేసుకుంటున్నాడు. క్రాక్ షూటింగ్ ఫినిషింగ్ స్టేజిలో ఉండగానే మరో సినిమా ఎనౌన్స్ చేశాడు. రమేష్ వర్మ డైరెక్షన్ లో కొత్త సినిమాను లాంచనంగా ప్రారంభించా. ఇది కాకుండా మరో మూడు సినిమాలు లైనప్ లో పెట్టుకున్నాడు మాస్ మహారాజా. అంటే ఇకపై మళ్ళీ మునుపటిలా రవితేజ నుండి ఏడాదికి రెండు మూడు సినిమాలు కన్ఫర్మ్ అన్నమాట.