17 ఇయర్స్ ఇండస్ట్రీ

Saturday,March 28,2020 - 12:34 by Z_CLU

స్టయిలిష్ స్టార్ బన్నీ 17 ఏళ్లు పూర్తిచేసుకున్నాడు. అతడు నటించిన గంగోత్రి సినిమా సరిగ్గా ఇదే రోజు (మార్చి 28, 2003)న థియేటర్లలోకి వచ్చింది. అలా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో కెరీర్ స్టార్ట్ చేసిన అల్లు అర్జున్.. ఈ 17 ఏళ్లలో ఇండస్ట్రీలో సూపర్ హిట్ హీరోగా ఎదిగాడు.

గంగోత్రితో హీరోగా మారిన బన్నీ, రెండో సినిమా ఆర్యతో ట్రెండ్ సెట్ చేశాడు. ఆల్ టైమ్ హిట్ కొట్టాడు. ఇక అక్కడ్నుంచి వెనక్కి తిరిగి చూడలేదు ఈ అల్లువారబ్బాయ్. మినిమం గ్యాప్స్ లో బ్లాక్ బస్టర్లు ఇస్తూనే ఉన్నాడు. అలా కెరీర్ లో ఇప్పటివరకు హీరోగా 19 సినిమాలు చేశాడు.

ప్రస్తుతం కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉన్నాడు బన్నీ. 19వ సినిమాగా అతడు చేసిన అల వైకుంఠపురములో సినిమా నాన్-బాహుబలి బ్లాక్ బస్టర్ గా చరిత్ర సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాల్లో అది బాహుబలి రికార్డును కూడా క్రాస్ చేసింది.

ప్రస్తుతం ఈ హీరో తన 20వ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో బన్నీ, ఓ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడనే టాక్ నడుస్తోంది. ఈ మూవీ కోసం ప్రస్తుతం మేకోవర్ అయ్యే పనిలో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్.