Bangarraju - నాగచైతన్యతో ఆ హీరోయిన్?

Wednesday,July 07,2021 - 02:21 by Z_CLU

నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. బంగార్రాజు టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సీక్వెల్ లో నాగార్జున తో కలిసి నాగ చైతన్య నటించనున్నాడు. అయితే నాగచైతన్య పాత్ర తాలూకు నిడివి తక్కువే అయినప్పటికీ ఇంపాక్ట్ కలిగించేలా ఉంటుందని తెలుస్తుంది. తాజాగా చైతు కి హీరోయిన్ గా కృతి శెట్టి ని లాక్ చేసుకున్నారట మేకర్స్.

Krithi Shetty

కృతి షెట్టి

‘ఉప్పెన’ తో మంచి క్రేజ్ అందకున్న కృతి చైతు సరసన హీరోయిన్ గా కనిపిస్తే సినిమాకు ప్లస్ అవుతుందని భావించి ఆమెను సంప్రదించారట. క్యారెక్టర్ నచ్చడంతో వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట కృతి. త్వరలోనే సినిమాకు సంబంధించి ఎనౌన్స్ మెంట్ రానుంది. మరి ఎనౌన్స్ మెంట్ కే చైతు, కృతి పేర్లు కూడా చెప్పేస్తారా ? లేదా ఓన్లీ సీక్వెల్ విషయం ఒక్కటే చెప్తూ టైటిల్ తో జస్ట్ ఎనౌన్స్ చేస్తారా ? చూడాలి.

ఇక సినిమాలో అక్కినేని అఖిల్ కూడా ఓ గెస్ట్ రోల్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై మేకర్స్ నుండి క్లారిటీ లేదు. చైతు మాత్రం ఉంటాడని పలు సందర్భాల్లో నాగార్జున చెప్పుకున్నారు. మరి అఖిల్ కూడా నటిస్తే ఇది అక్కినేని కుటుంబం నుండి వచ్చే మరో మనం లాంటి సినిమా అవుతుంది. అందులో సందేహం లేదు. సోగ్గాడే చిన్ని నాయన సినిమా రిలీజ్ చేసినట్టే ఈ సీక్వెల్ ను కూడా సంక్రాంతికే ప్లాన్ చేస్తున్నాడు నాగార్జున. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics