Bangarraju - క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Monday,May 24,2021 - 05:28 by Z_CLU

దాదాపు రెండేళ్లుగా ప్రీ ప్రొడక్షన్ స్టేజిలోనే ఉన్న ‘బంగార్రాజు’ సినిమా ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్ళబోతుంది. కోవిడ్ కంటే ముందు కొన్ని కారణాల వల్ల షూటింగ్ వరకు వచ్చి ఆలస్యం అవుతూ వచ్చిన ఈ సినిమా జూన్ లేదా జులై నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను టైటిల్ తో పాటు ఎనౌన్స్ చేసి వివరాలు తెలియజేయనున్నారు నాగార్జున. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ పై నాగార్జున స్వీయ నిర్మాణంలో కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా ఈ సినిమా తెరకెక్కనుంది.

nagarjuna akhil nagachaitanya

నాగచైతన్య   నాగార్జున   అఖిల్

‘సోగ్గాడే చిన్ని నాయన’లో స్పెషల్ సాంగ్ అందరినీ ఎట్రాక్ట్ చేసి సినిమాకు హైలైట్ గా నిలిచింది. అందుకే దానికి సీక్వెల్ గా రాబోతున్న బంగార్రాజులో కూడా అలాంటి ఓ సాంగ్ ను పెట్టాలని భావిస్తున్నారట. దాన్ని పాయల్ రాజ్ పుత్ తో చేయించాలని మేకర్ అనుకుంటున్నారని, ఇటివలే ఈ హాట్ బ్యూటీ తో ఆ సాంగ్ కోసం సంప్రదింపులు జరిపారని ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేసింది పాయల్. తను ఎలాంటి స్పెషల్ సాంగ్ ఒప్పుకోలేదు అంటూ క్లియర్ కట్ చెప్తూ అభిమానులకి క్లారిటీ ఇచ్చింది. పాయల్ సినిమా పేరు మెన్షన్ చేయలేదు కానీ ఆమె తాజాగా బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుంది అంటూ జరుగుతున్న ప్రచారం గురించే క్లారిటీ ఇచ్చిందని అర్థమవుతుంది.

payal rajput new stills zeecinemalu

పాయల్ రాజ్ పుత్

ఫాంటసీ ఎలిమెంట్ తో విలేజ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాగార్జున టైటిల్ రోల్ లో నటించనుండగా రమ్య కృష్ణ నాగ్ కి భార్య పాత్రలో కనిపించనుంది. సినిమాలో నాగ చైతన్య కూడా ఓ క్యారెక్టర్ చేయనున్నాడని అంటున్నారు. దానిపై క్లారిటీ రావల్సిఉంది.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics