ఇంటర్నెట్ లో 'ఖైదీ నంబర్ 150' సినిమా

Tuesday,December 13,2016 - 04:30 by Z_CLU

టాలీవుడ్ కు మరో షాకింగ్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ సినిమా ఖైదీ నంబర్-150 లీకైంది. నెట్ లో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన డాన్స్ క్లిప్ హల్ చల్ చేస్తోంది. మెగాస్టార్ అంటేనే డాన్స్ కు పెట్టింది పేరు. అందుకే చిరంజీవికి చెందిన ఓ డాన్స్ క్లిప్ ను ఎవరో కావాలనే నెట్ లో లీక్ చేశారు. మరీ ముఖ్యంగా సినిమాలో అది సిగ్నేచర్ స్టెప్ అని తెలుస్తోంది.

షూటింగ్ టైం లో ఓ మొబైల్ తో షూట్ చేసిన ఈ వీడియోలో దేవిశ్రీ వాయిస్ తో చిరు డాన్సులు అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. అసలే మెగా స్టార్ స్టెప్స్ ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేద్దామా? అని ఎదురుచూస్తున్న మెగా ఫాన్స్ ఈ వీడియోను రిపీట్ గా చూస్తూ తెగ సంబరపడిపోతున్నారు. చిన్న బిట్ కావడం, పైగా వీడియోలో క్లారిటీ లేకపోవడంతో ఖైదీ యూనిట్, ఈ విషయాన్ని లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది.