వెంకీ 'గురు' టీజర్ టాక్

Tuesday,December 13,2016 - 03:25 by Z_CLU

వెంకటేష్ ‘గురు’ టీజర్ రిలీజయింది. హిందీలో సూపర్ హిట్ అయిన ‘సాలా ఖడూస్’ కి రీమేక్ గా తెరకెక్కిన ‘గురు’ జనవరి 26 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ లోపు వెంకటేష్ బర్త్ డే సందర్భంగా సర్ ప్రైజింగ్ టీజర్ ని లాంచ్ చేశారు.

కనీసం ఒక్క డైలాగ్ కూడా లేకుండా రిలీజయిన గురు ట్రైలర్, వెంకీలోని ఎనర్జిటిక్, ఊరమాస్ యాంగిల్ ని సూపర్బ్ గా ఎలివేట్ చేస్తుంది. సిచ్యువేషన్ పెద్దగా తెలీడం లేదు కానీ, వెంకటేష్ లుక్స్, బాడీ లాంగ్వేజ్ వెంకీ ఫ్యాన్స్ పై, ఎక్స్ పెక్టేషన్స్ కన్నా హై ఇంపాక్ట్ నే క్రియేట్ చేస్తున్నాయి.

సుధా కొంగర డైరెక్షన్ లో రితిక హీరోయిన్ గా తెరకెక్కిన ‘గురు’ జనవరి 26 న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ సంగీతం అందించాడు.