లీకైన కాటమరాయుడు క్లైమాక్స్

Wednesday,March 01,2017 - 11:52 by Z_CLU

కాటమరాయుడు క్లైమాక్స్ లీకైంది. ఓ వైపు బ్యాలన్స్ ఉన్న క్లైమాక్స్ పార్ట్ ని కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుని,  షూటింగ్ కి సక్సెస్ ఫుల్ గా ప్యాకప్ చెప్పే ఆలోచనలో ఉన్న సినిమా యూనిట్ కి ఈ న్యూస్ పెద్ద కుదుపు లాంటిదే. గతంలో పవర్ స్టార్ ‘అత్తారింటికి దారేది’ సినిమాకు కూడా ఈ లీక్ కష్టాలు తప్పలేదు. ఇప్పుడు కాటమరాయుడుకి కూడా ఈ త్రెట్ తప్పలేదు.

అనౌన్స్ చేసినప్పటి నుండే క్రియేట్ అయిన హై ఎక్స్ పెక్టేషన్స్, క్యూరాసిటీ ఏదైతేనేం.. సినిమా మార్చిలో గ్యారంటీ గా రిలీజ్ అని ఓ వైపు కన్ఫర్మేషన్ ఇస్తున్నా, యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తున్న వీడియోస్ సినిమా యూనిట్ కి పెద్ద తలనొప్పిలా తయారయ్యాయి.

 

అఫ్ కోర్స్ క్లైమాక్స్ లీక్ అని ఇన్ఫర్మేషన్ అందగానే అలర్ట్ అయిన సినిమా యూనిట్, మ్యాగ్జిమం లీక్డ్ స్టఫ్ ఏది ఆన్ లైన్ లో లేకుండా జాగ్రత్తలు తీసుకునే పనిలో పడింది. కిషోర్ కుమార్ పార్ధసాని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా, అల్టిమేట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది.