KGF నిర్మాత నెక్స్ట్ సినిమా ఇదే !

Thursday,April 21,2022 - 03:18 by Z_CLU

KGF Producer team up with Director Sudha Kongara

KGF , KGF 2 సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు అందుకున్న నిర్మాణ సంస్థ హంబలే ఫిలిమ్స్ నెక్స్ట్ సినిమా అప్ డేట్ వచ్చేసింది. భారీ లెవెల్ ఫ్రాంచైజీ తర్వాత ఈ సంస్థ ఏ దర్శకుడితో సినిమా చేస్తుంది ? అనే సందేహాలకి ఆన్సర్ దొరికింది. నెక్స్ట్ సుధా కొంగర దర్శకత్వంలో హంబలే ఫిలిమ్స్ ఓ భారీ సినిమా నిర్మించనుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా సోషల్ మీడియా ద్వారా ఎనౌన్స్ చేశారు.

సుధా కొంగర సూర్యతో ‘ఆకాశమే నీ హద్దురా ‘ అనే తీసి బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆ సినిమా తర్వాత ఆమె ట్రూ ఈవెంట్స్ తో ఓ ట్రూ స్టోరీ రెడీ చేసుకున్నారు. ఆ కథతోనే ఇప్పుడు హంబలే ఫిలిమ్స్ లో సినిమా చేయబోతున్నారు.

సుధాకొంగర తెలుగులో వెంకటేష్ తో ‘ గురు’ సినిమా చేసింది. తాజాగా సూర్య ను డైరెక్ట్ చేసింది. మరి ఇప్పుడు KGF నిర్మాత విజయ్ నిర్మాణంలో సుధా కొంగర చేయబోతున్న సినిమా ఏ హీరోతో ఉండబోతుంది ? పాన్ ఇండియా లెవెల్ లోనే ఈ ప్రాజెక్ట్ ఉండనుందా ? అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బయటికి రానున్నాయి.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics