Acharya చిరు , చరణ్ కోసం మహేష్ ?

Thursday,April 21,2022 - 01:29 by Z_CLU

Latest Buzz : Mahesh Babu Voice Over for ‘Acharya’ ?

ఈ మధ్య బడా సినిమాలో ఓ స్టార్ వాయిస్ ఓవర్ అనేది కామన్ అయిపోయింది. సినిమా కథని, అందులో పాత్రలను పరిచయం చేయడానికి స్టార్ వాయిస్ ఓవర్ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఆచార్య కి కూడా అలాంటి స్టార్ వాయిస్ ఓవర్ యాడ్ అవ్వబోతుందని తెలుస్తుంది. అవును సూపర్ స్టార్ మహేష్ ఆచార్య కి వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడనే టాక్ గట్టిగా వినబడుతుంది.

మెగా స్టార్ , మెగా పవర్ స్టార్ కాంబినేషన్ లో శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకోసమే థియేటర్స్ కొన్ని సర్ ప్రయిజ్ లు ప్లాన్ చేస్తున్నారట కొరటాల. అందులో మహేష్ వాయిస్ ఓవర్ ఒకటని అంటున్నారు. మహేష్ తో రెండు సినిమాలు తీశాడు కొరటాల. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండనే ఉంది. పైగా మెగా స్టార్ అంటే మహేష్ చాలా గౌరవం. చరణ్ అంటే అమితమైన ఇష్టం. అందుకే ఆచార్య కి మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండొచ్చు.

గతంలో కూడా పవన్ కళ్యాణ్ ‘జల్సా’ , ఎన్టీఆర్ ‘బాద్ షా’ సినిమాలకు వాయిస్ ఇచ్చాడు మహేష్. ఇప్పుడు ఆచార్య కి కూడా సూపర్ స్టార్ సూపర్ వాయిస్ హెల్ప్ అవ్వడం ఖాయమనిపిస్తుంది. మరి ఈ విషయాన్ని మేకర్స్ త్వరలోనే అఫీషియల్ గా చెప్పే అవకాశం ఉంది.

మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ , కొణిదెల ప్రొడక్షన్ కంపనీ బేనర్స్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 29న గ్రాండ్ గా రిలీజవుతోంది.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics