RC15 షూటింగ్ అప్డేట్స్

Thursday,April 21,2022 - 05:29 by Z_CLU

Shooting Updates of Ram Charan’s ‘RC15’

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న RC15 మూవీ మరో షెడ్యుల్ కంప్లీట్ చేసుకుంది. ఇటివలే రాజమండ్రి , హైదరాబాద్ లో భారీ షెడ్యుల్ ఫినిష్ చేసిన యూనిట్ తాజాగా పంజాబ్ లోని అమ్రిత్సర్ కి వెళ్లారు. అక్కడ దాదాపు పదిహేను రోజుల పాటు షెడ్యుల్ జరిపారు. రామ్ చరణ్ తో పాటు మరికొందరు నటీ నటులు పాల్గొన్నారు. నిన్నటితో అమ్రిత్సర్ షెడ్యుల్ కంప్లీట్ చేసి హైదరాబాద్ తిరిగి వచ్చారు.

RC15 కి సంబంధించి మరో షెడ్యుల్ పూర్తి చేసిన చరణ్ రేపటి నుండి ‘ఆచార్య’ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసి చిరుతో కలిసి సందడి చేయనున్నాడు. ‘ఆచార్య’ రిలీజ్ అయిన వెంటనే శంకర్ సినిమాకు సంబంధించి మరో షెడ్యుల్ మొదలు పెట్టనున్నాడు చరణ్.

త్వరలోనే విశాఖపట్నంలో భారీ షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. దాంతో కంటిన్యూగా రాజమండ్రి షెడ్యుల్ కూడా జరగనుంది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు తీసిన అనంతరం హైదరాబాద్ తిరిగి వస్తారని ఇక్కడ భారీ సెట్స్ లో సాంగ్స్ షూట్ చేయనున్నారని సమాచారం.

దిల్ రాజు నిర్మాణంలో SVC50 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ సరసన కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీకాంత్ , అంజలి , సునీల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics