మహానటి ‘సదానన్ను’ మెస్మరైజ్ చేస్తుంది

Thursday,April 26,2018 - 08:11 by Z_CLU

మహానటి సెకండ్ సింగిల్ ‘సదానన్ను’ రిలీజయింది. సీతారామ శాస్త్రి లిరిక్స్ రాసిన ఈ పాటను చారులత పాడింది. ఈ లిరికల్ వీడియోని బట్టి ఈ సాంగ్ సమంత, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఉండబోతుందా..? లేకపోతే కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ లో ఉండబోతుందా అనేది గెస్ట్ చేయడం కష్టం కానీ, ఈ సాంగ్ మాత్రం మే 11 న రిలీజ్ కానున్న ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీని రేజ్ చేస్తుంది.

‘సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే..” అంటూ బిగిన్ అయ్యే లిరిక్స్, 80’s ఫ్లేవర్ ఏ మాత్రం మిస్ కాకుండా కంపోజ్ అయిన మిక్కీ జె. మేయర్ ట్యూన్స్ ఫ్రెష్ ఫీలింగ్ ని కలిగిస్తున్నాయి. దానికి తోడు ఈ వీడియోలో సాంగ్ లిరిక్స్ తో పాటు, ఈ సినిమా మేకింగ్ షాట్స్ ని ఇన్సర్ట్ చేయడంతో, సినిమాపై మరిన్ని ఎక్స్ పెక్టేషన్స్ రేజ్ అవుతున్నాయి.

సీనియర్ నటి సావిత్రి… స్టార్ గా అనుభవించిన వైభవం తో పాటు పర్సనల్ లైఫ్ లోని మరెన్నో విషయాలను అద్భుతంగా ప్రెజెంట్ చేయనున్నాడు నాగ్ అశ్విన్. వాటితో పాటు సమంతా, విజయ్ దేవరకొండ క్యారెక్టర్స్ ని అంతే ప్లాన్డ్ గా డిజైన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాని ప్రయాంక దత్, స్వప్నదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.