మరో రికార్డు దిశగా మహానటి

Wednesday,May 16,2018 - 05:16 by Z_CLU

మహానటి సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు ఫస్ట్ వీక్ లో 19 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. తక్కువ థియేటర్లలో విడుదలై, కేవలం 7 రోజులకే ఇంత షేర్ రాబట్టడం నిజంగా గొప్ప. ఇప్పుడీ సినిమా ఓవర్సీస్ లో మరో రికార్డుకు దగ్గరైంది.

ఓవర్సీస్ లో ఈ సినిమా విడుదలైన 4 రోజులకే మిలియన్ మార్క్ అందుకుంది. ఇప్పుడు 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరేందుకు సిద్ధంగా ఉంది. నిన్నటి వసూళ్లతో కలుపుకుంటే మహానటి సినిమాకు ఓవర్సీస్ లో 1.86 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. ఇంకో 14 వేల డాలర్లు వస్తే సినిమా 2 మిలియన్ క్లబ్ లోకి చేరిపోతుంది.

బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న మహానటి 14వేల డాలర్లు ఆర్జించడం పెద్ద సమస్య కాదు. పైగా రేపట్నుంచి ఈ సినిమాకు ఓవర్సీస్ లో 17 స్క్రీన్స్ అదనంగా పెంచారు. సో.. మరికొన్ని గంటల్లో ఈ సినిమా 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి గ్రాండ్ గా ఎంటర్ కానుంది.