Samantha - కెరీర్ కు గ్యాప్ ఇచ్చిన అక్కినేని కోడలు

Thursday,August 26,2021 - 12:07 by Z_CLU

అక్కినేని కోడలు సమంత గ్యాప్ తీసుకుంటోంది. సినిమాలకు కొన్నాళ్ల పాటు విరామం ఇవ్వబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా సమంతానే ప్రకటించింది. ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టింది శామ్.

Samantha Akkineni

“ప్రస్తుతం నా చేతిలో ఏ సినిమా లేదు. శాకుంతలం సినిమాను కూడా పూర్తిచేశాను. కొన్నాళ్లు గ్యాప్  తీసుకోవాలనుకుంటున్నాను. గ్యాప్ తీసుకున్న తర్వాత మాత్రమే కొత్త కథలు వింటాను. ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్-కె, పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ సినిమాల్లో నేను లేను. అవి గాసిప్స్ మాత్రమే.”

Samantha Akkineni

ఇలా తన కెరీర్ కు సంబంధించి పూర్తి స్పష్టత ఇచ్చింది సమంత. ప్రస్తుతం ఆమె విజయ్ సేతుపతి హీరోగా ఓ తమిళ సినిమాలో నటిస్తోంది. మరో 10 రోజుల్లో ఆ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక గ్యాప్ తీసుకొని సమంత ఏం చేయబోతోందనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మరోవైపు ఇది చిన్న విరామం మాత్రమే అంటోంది శామ్.

samantha akkineni new stills zeecinemalu

“నేను సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడం లేదు. జస్ట్ కొన్ని నెలలు గ్యాప్ తీసుకుంటాను. ప్రస్తుతం సమంత 2.O చూస్తున్నారు. గ్యాప్ తర్వాత సమంత 3.O చూస్తారు. మరిన్ని మంచి పాత్రలతో ప్రేక్షకుల ముందుకొస్తాను.”

అయితే కెరీర్ లో ఎందుకు గ్యాప్ తీసుకుంటున్నాననే విషయాన్ని మాత్రం ఈ అక్కినేని కోడలు పిల్ల వెల్లడించలేదు. 11 ఏళ్లుగా రెగ్యులర్ గా షూటింగ్స్ లోనే ఉంటున్నానని అందుకే గ్యాప్ తీసుకుంటున్నానని చెబుతున్నప్పటికీ.. అది అంత కన్విన్సింగ్ గా లేదు. ఎందుకంటే, లాక్ డౌన్ అంతా సమంత గ్యాప్ లోనే ఉంది కదా.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics