రాజమౌళి మల్టీస్టారర్ లో కీర్తి సురేష్

Tuesday,May 15,2018 - 01:11 by Z_CLU

మహానటి సినిమాతో కీర్తి సురేష్ కి భారీ క్రేజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాలో సీనియర్ నటి సావిత్రిగా కీర్తి సురేష్ పర్ఫామెన్స్ క్రిటిక్స్ ని కూడా ఇంప్రెస్ చేసింది. ఈ సక్సెస్ తో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంటున్న కీర్తి సురేష్, మరో భారీ మల్టీస్టారర్ లో చాన్స్ కొట్టేసింది. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కనున్న మల్టీస్టారర్ లో కీర్తి హీరోయిన్ గా ఫిక్సయిందనే న్యూస్, టాలీవుడ్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.

మహానటి సినిమా రిలీజ్ తరవాత కీర్తి సురేష్ పర్ఫామెన్స్ కి మెస్మరైజ్ అయిన ఫిల్మ్ మేకర్స్ లో రాజమౌళి కూడా ఉన్నాడు. మహానటి తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన కీర్తి సురేష్ పైనే ఇప్పుడు అందరి దృష్టి ఫిక్సయి ఉంది. ప్రస్తుతం తన మల్టీస్టారర్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న జక్కన్న కూడా కీర్తి సురేష్ ని తన సినిమాలో ఫిక్స్ చేసుకున్నాడన్న న్యూస్, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

 

అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న రాజమౌళి సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ స్టేజ్ లో ఉంది. స్క్రిప్ట్ ఫైనలైజ్ అయ్యాకే తక్కిన కాస్టింగ్ పై దృష్టి పెట్టాలని డిసైడ్ అయి ఉన్న రాజమౌళి, నిజంగానే తన సినిమాలో కీర్తిని ప్రిఫర్ చేస్తున్నాడా..? హాట్ టాపిక్ గా మారిన ఈ టాక్ జస్ట్ రూమర్ లా మిగిలిపోతుందా..? లేక అఫీషియల్ గా ట్రాన్స్ ఫామ్ అవుతుందా..? లాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.