దుల్కర్ సల్మాన్ ఇంటర్వ్యూ

Tuesday,May 15,2018 - 03:44 by Z_CLU

మహానటి సినిమాలో సావిత్రి భర్త జెమినీ గణేషన్ పాత్రలో నటించాడు దుల్కర్ సల్మాన్. గతంలో ‘ఓకె బంగారం’ సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయిన దుల్కర్, మహానటి సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన దుల్కర్.. మహానటి  గురించి  మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు…

నాకలాంటి ఫీలింగ్ లేదు…

ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా.. మేల్ ఓరియంటెడ్ సినిమా అనే ఫీలింగ్ నాకు లేదు.. నా దృష్టిలో సినిమానే హీరో… ఇక మహానటి విషయానికొస్తే అంత గొప్ప సినిమాలో చిన్న రోల్ చేసినా గొప్పే… అందుకే ఈ సినిమా చేశాను…

 

నాగ్ అశ్విన్ కి ఆ విషయం ముందే తెలుసు…

నన్ను జెమినీ గణేశన్ రోల్ లో నటించమన్నప్పుడు నాగ్ అశ్విన్ కి కూడా క్లారిటీ ఉంది. నేను జెమినీ గణేషన్ లా అస్సలు కనిపించను.

మహానటి నా కరియర్ లోనే బెస్ట్ సినిమా…

ఈ సినిమాలో చిన్న రోల్ అయినా చేయగలిగినందుకు చాలా హ్యాప్పీగా ఫీలవుతున్నాను… మహానటి ఎప్పటికీ నా కరియర్ లో గొప్ప సినిమాగా ఉండిపోతుంది. నా కెరీర్ లో బిగ్ మూవీ ఇది.

నేను తెలుసుకున్న జెమినీ గణేషన్…

జెమినీ గణేషన్ సావిత్రిని పెళ్ళి చేసుకునే నాటికీ ఆయనకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు. దాంతో పాటు పుష్పవల్లి తో రిలేషన్ షిప్ లో ఉన్నారు. కానీ ఆయన మంచితనం వల్లే ఆయన్ని అందరూ ఇష్టపడే వాళ్ళు… ఆయన పిల్లలు విజయ చాముండేశ్వరి, సతీష్ చెప్పిన దాని ప్రకారం ఒక్కోసారి ఇంటికి తొందరగా వచ్చి పిల్లల కోసం వంట కూడా చేసి పెట్టేవారంట…

జెమినీ గణేషన్ లైఫ్…

సినిమాల్లో లైఫ్ ఎంత ప్లెజెంట్ గా ఉంటుందో జెమినీ గణేషన్ కూడా అంతే ప్లెజెంట్ గా బ్రతికారు…  కెమిస్ట్రీ లెక్చరర్ గా కరియర్ బిగిన్ చేసిన ఆయన సినిమాలపై ఇష్టంతో జెమినీ స్టూడియోస్ లో ప్రొడక్షన్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యారు… అక్కడి నుండి బిగిన్ అయిన ఆయన చాలా తక్కువ టైమ్ లో స్టార్ గా ఎదిగారు…

ప్రతీది అద్భుతం…

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది కాబట్టే ఇంత అద్భుతంగా వచ్చిందేమో… పెద్ద సెట్స్, కాస్ట్యూమ్స్.. సినిమాటోగ్రఫీ… ప్రతీది అద్భుతం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.

తెలుగులో డబ్బింగ్…

హైదరాబాద్ కి ఎక్కువగా రాను కాబట్టి నాకు తెలుగు అంతగా రాదు. అయినా నా క్యారెక్టర్స్ కు నేనే డబ్బింగ్ చెప్పుకోవడం నాకిష్టం. అందుకే నేనే డబ్బింగ్ చెప్పాను. తమిళంలో డబ్బింగ్ అంత కష్టం కాలేదు. ఎందుకంటే నేను చెన్నైలోనే పెరిగాను. తెలుగు వెర్షన్ కోసం రోజూ 8 గంటలు చొప్పున వారం రోజులు డబ్బింగ్ చెప్పా.