మరో భారీ షెడ్యూల్ లో కాటమరాయుడు

Friday,January 06,2017 - 04:55 by Z_CLU

కొత్త సంవత్సరంలో, కొత్త షెడ్యూల్ ప్రారంభించాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. కాటమరాయుడుకు సంబంధించి ఇవాళ్టి నుంచి హైదరాబాద్ లో మరో భారీ షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఈ షూట్ లో సినిమాకు సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ పిక్చరైజ్ చేస్తున్నారు. ఇంతకంటే ముందు పొలాచ్చిలో సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాల్ని పూర్తిచేశారు.

డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు సినిమా రూపుదిద్దుకుంటోంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ తో పాటు.. మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. తాజా సమాచారం ప్రకారం, ఈ నెలాఖరుకు కాటమరాయుడు షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశాలున్నాయి. ఫిబ్రవరిలో ఆడియో రిలీజ్ చేసి, మార్చి మూడో వారంలో సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.