నిఖిల్ సినిమాకు 50 రోజులు

Friday,January 06,2017 - 04:02 by Z_CLU

పెద్ద నోట్ల రద్దు వంటి క్లిష్టమైన పరిస్థితుల మధ్య విడుదలైన సినిమా ఎక్కడికి పోతావ్ చిన్నవాడా. నిఖిల్ హీరోగా, హెబ్బా పటేల్-నందిని శ్వేత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఎక్కడికి పోతావ్ చిన్నవాడా తాజాగా 50రోజులు కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమా 28 థియేటర్లలో దిగ్విజయంగా ప్రదర్శించబడుతోంది. తన సినిమా 50 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా నిఖిల్ ట్విట్టర్ లో ఆనందాన్ని వ్యక్తంచేశాడు.

epc-50-days-zee-cinemalu

త్వరలోనే టోటల్ సినిమా యూనిట్ అందరం కలిసి ఏదో ఒక థియేటర్ లో ఎక్కడికి పోతావ్ చిన్నవాడా సినిమా చూస్తామని ఎనౌన్స్ చేశాడు నిఖిల్. ఇప్పటివరకు ఈ సినిమాకు దాదాపు 38కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మంచి విజయాన్నందుకుంది.