ప్రత్యేక ప్రదర్శనకు ప్రారంభమైన ఏర్పాట్లు

Friday,January 06,2017 - 05:35 by Z_CLU

బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి రిలీజ్ కు రెడీ అయింది. సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి విడుదల తేదీని కూడా ప్రకటించారు. అయితే సినిమా స్పెషల్ షోకు సంబంధించిన డీటెయిల్స్ మాత్రం యూనిట్ చెప్పడం లేదు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు శాతకర్ణి సినిమాను విడుదలకు ముందే ప్రత్యేకంగా చూపిస్తామని దర్శకుడు క్రిష్ గతంలోనే ప్రకటించాడు. ఆ ఎనౌన్స్ మెంట్ కు తగ్గట్టే ఇప్పుడు పావులు కదులుతున్నాయి. తెలంగాాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బాలకృష్ణ ప్రత్యేకంగా కలిశారు. గౌతమీపుత్ర శాతకర్ణి ప్రత్యేక ప్రదర్శనకు ఆహ్వానించారు.

ఈ సినిమా ప్రారంభోత్సవానికి హాజరైన కేసీఆర్, మొదట్నుంచి మూవీపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తూ వస్తున్నారు. సినిమాను తనకు చూపించాలని లాంఛింగ్ రోజునే యూనిట్ ను కోరాారు. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శనను ఏర్పాటుచేసే పనిలో ఉంది శాతకర్ణి యూనిట్. అయితే స్పెషల్ షో ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. సంక్రాంతి కానుకగా ఈనెల 12న గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు పన్ను రాయితీలు ఇచ్చిన విషయం తెలిసిందే.