ఆద్య బర్త్ డే సెలెబ్రేషన్స్ కి అటెండ్ అయిన పవన్ కళ్యాణ్

Friday,March 24,2017 - 12:46 by Z_CLU

ఓ వైపు కాటమ రాయుడు రిలీజ్ హంగామా, మరో వైపు పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య పుట్టిన రోజు సెలబ్రేషన్స్ రెండూ ఒకేసారి కలిసి వచ్చాయి. పూణేలో రేణూ దేశాయ్ తో ఉంటున్న ఆద్య పుట్టిన రోజు కోసం ఇంత బిజీ షెడ్యూల్స్ లోను ప్లాన్ చేసుకుని మరీ నిన్న జరిగిన బర్త్ డే సెలెబ్రేషన్స్ కి అటెండ్ అయ్యాడు పవర్ స్టార్. స్కూల్ లో జరిగిన ఈ సెలెబ్రేషన్స్ లో ఆద్య ఫ్రెండ్స్ తో కూడా టైం స్పెండ్ చేశాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడీ ఇమేజెస్ సోషల్ నెట్ వర్క్ లోను అటు పవర్ ఫ్యాన్స్ లోను హల్ చల్ చేస్తున్నాయి.