తెలుగులో కార్తి బెస్ట్ మూవీ ఇదే

Friday,November 08,2019 - 11:55 by Z_CLU

చాలా సినిమాలు చేశాడు. చేసిన ప్రతి సినిమాను తెలుగులోకి తీసుకొచ్చాడు. అందులో కొన్ని హిట్ కూడా అయ్యాయి. కానీ ఓవరాల్ గా అతడి కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా నిలిచింది ఖైదీ సినిమా. టాలీవుడ్ లో కార్తికి హయ్యస్ట్ కలెక్షన్లు తీసుకొస్తోంది

సక్సెస్ ఫుల్ గా 2 వారాలు కంప్లీట్ చేసుకొని, మూడో వారంలోకి అడుగుపెట్టిన ఖైదీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 13 కోట్ల రూపాయల షేర్ సాధించింది. కార్తి గత చిత్రాలతో పోల్చుకుంటే ఇది రికార్డ్ కలెక్షన్

డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో కార్తి రఫ్ లుక్ లో కనిపించాడు. లోకేష్ డైరక్ట్ చేసిన ఈ సినిమా ఈ వీకెండ్ కూడా మంచి వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.