మళ్లీ బాలీవుడ్ లోనే రకుల్

Friday,November 08,2019 - 12:06 by Z_CLU

ఈ ఏడాది ఇప్పటికే దేదే ప్యార్ దే సినిమాతో బాలీవుడ్ లో హిట్ కొట్టింది రకుల్ ప్రీత్. త్వరలోనే మర్జావాన్ అనే మరో సినిమాతో కూడా హిందీ ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. ఇప్పుడు ఇదే ఊపులో మరో బాలీవుడ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ చిన్నది. ఈసారి అర్జున్ కపూర్ సరసన మెరవనుంది.

నిఖిల్ అద్వానీ దగ్గర వర్క్ చేసిన కాష్వి నాయర్ త్వరలోనే దర్శకుడిగా మారబోతున్నాడు. అర్జున్ కపూర్ ను హీరోగా పెట్టి ఓ పీరియాడిక్  లవ్ స్టోరీ చేయబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ను తీసుకున్నారు.

మన్మథుడు 2 ఫ్లాప్ తర్వాత ఎక్కువగా తమిళ, హిందీ సినిమాలకే కాల్షీట్లు కేటాయిస్తోంది రకుల్. ఇప్పటికే 2 తమిళ సినిమాలు చేస్తోంది. తాజా చిత్రంతో బాలీవుడ్ లో కూడా ఈ ఏడాది కౌంట్ 3కు చేరింది. మళ్లీ ఆమె తెలుగులో స్ట్రయిట్ మూవీ ఎప్పుడు చేస్తుందో చూడాలి.