నయనతార డోర సెన్సార్ క్లియరెన్స్

Tuesday,March 21,2017 - 06:03 by Z_CLU

హారర్ సినిమాలకి డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది. ఎంత పెద్ద స్టార్ సినిమాలు డామినేట్ చేస్తున్నా, హారర్ జోనర్ చూపించే ఇంపాక్ట్ ఎలివేట్ అవుతూనే ఉంటుంది. అందుకే స్టార్స్ కూడా హారర్ సినిమాలను ప్రిఫర్ చేస్తూనే ఉంటారు. నయనతార డోర ఇంపాక్ట్ కూడా టాలీవుడ్ లో అదే రేంజ్ లో కనిపిస్తుంది.

హై ఎండ్ హారర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన డోర మార్చి 31 న రిలీజ్ అవుతుంది. ఈ రోజే సెన్సార్ ఫార్మాలిటీస్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా A సర్టిఫికెట్ పొందింది. తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజవుతున్న ఈ సినిమాని మాల్కాపురం శివ కుమార్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

బ్యాక్ టు బ్యాక్ విమెన్ సెంట్రిక్ సినిమాలతో పాటు, భారీ సినిమాలకు సంతకాలు చేస్తూ బిజీ బిజీగా ప్లాన్ చేసుకుంటున్న నయనతార కరియర్ లో ‘డోర’ డెఫ్ఫినేట్ గా స్పెషల్ మూవీగా నిలిచిపోతుందని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్. ఈ సినిమా దాస్ రామస్వామి డైరెక్షన్ లో తెరకెక్కింది.