Karnan Telugu Remake - దర్శకుడు ఎవరు?

Thursday,May 20,2021 - 04:12 by Z_CLU

కోలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కర్ణన్’ సినిమాను తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇటివలే సినిమాకు సంబంధించి తెలుగు రీమేక్ రైట్స్ కొనుగోలు చేసి ఎనౌన్స్ చేశారు నిర్మాత బెల్లంకొండ సురేష్. ఈ రీమేక్ సినిమాను పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసే దర్శకుడి కోసం సెర్చ్ చేస్తున్నారు సురేష్. తాజా సమాచారం ప్రకారం ప్రకారం ఈ రీమేక్ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతిలో పెట్టనున్నారని తెలుస్తుంది.

karnan movie telugu review zeecinemalu

కర్ణన్ లో ధనుష్

ప్రస్తుతం వెంకటేష్ హీరోగా ‘నారప్ప’ సినిమా చేస్తున్నాడు అడ్డాల. ఆ సినిమా ధనుష్ హీరోగా వచ్చిన కోలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘అసురన్’ కి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇటివలే రష్ చూసిన నిర్మాత సురేష్ బాబు అవుట్ పుట్ విషయంలో ఫుల్ హ్యాపీ గా ఉన్నారనే టాక్ వినబడుతుంది. అందుకే కర్ణన్ రీమేక్ ని కూడా శ్రీకాంత్ అడ్డాల చేతిలో పెట్టాలని శ్రీనివాస్ తండ్రి సురేష్ అనుకుంటున్నారట. ప్రస్తుతానికయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ లేదు కానీ త్వరలోనే శ్రీకాంత్ అడ్డాలని ఫైనల్ చేసి ప్రకటిస్తారని తెలుస్తుంది.

srikanth-addala-zeecinemalu

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల

బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం వివి వినాయక్ డైరెక్షన్ లో హిందీలో ‘ఛత్రపతి’ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. రాజమౌళి -ప్రభాస్ కాంబోలో వచ్చి సెన్సేషనల్ హిట్ సాధించిన ఆ సినిమాతో బాలీవుడ్ లో హీరోగా పరిచయమవ్వనున్నాడు శ్రీనివాస్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఆ రీమేక్ సినిమా పూర్తవ్వగానే కర్ణన్ రీమేక్ ని స్టార్ట్ చేస్తాడు శ్రీనివాస్. అప్పటి వరకు కర్ణన్ కి సంబంధించి తెలుగు స్క్రిప్ట్ రెడీ చేస్తారు. సొంత బేనర్ లోనే ఈ రీమేక్ సినిమా చేయనున్నాడు సాయి శ్రీనివాస్.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics