NTR Prashanth Neel - మోస్ట్ ఎవైటింగ్ కాంబినేషన్ వస్తోంది

Thursday,May 20,2021 - 03:54 by Z_CLU

కొరటాల శివ డైరెక్షన్ లో చేయబోయే #NTR30 సినిమా తర్వాత తారక్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు ? ప్రశాంత్ నీల్ తో తారక్ సినిమా ఎప్పుడు ఉంటుంది? వీటన్నిటికి ఎనౌన్స్ మెంట్ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవైటింగ్ కాంబో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాను నేడు తారక్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు. #NTR31 గా ఈ క్రేజీ మాస్ కాంబో ఎనౌన్స్ అయ్యింది.

ntr prashanth neel movie announcement zeecinemalu 1

దీంతో కొరటాల సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ప్రశాంత్ నీల్ తోనే ఉండబోతుందని ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చింది. RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్న ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాలను కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నాడు. #NTR30, #NTR31 రెండూ నాలుగు భాషలో తెరకెక్కనున్నాయి. KGF సినిమా రిలీజ్ అవ్వగానే ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసుకున్నాడు ఎన్టీఆర్. కాకపోతే ప్రాజెక్ట్ సెట్ అయ్యేసరికి కాస్త ఆలస్యమయింది.

ప్రస్తుతం ‘KGF చాప్టర్ 2’ కి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ మరో వైపు ప్రభాస్ తో ‘సలార్’ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే ఎన్టీఆర్ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఈ లోపు RRR కి సంబంధించి తన పార్ట్ ఫినిష్ చేసి కొరటాల సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చి దాన్ని వీలైనంత తొందరగా ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నాడు తారక్. ఇద్దరు తమ కమిట్ మెంట్స్ పూర్తి చేసి తమ కాంబో సినిమాను మొదలు పెడతారు.

మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని డీటెయిల్స్ బయటికి రానున్నాయి. మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ ని ప్రశాంత్ ఎలాంటి మాస్ క్యారెక్టర్ లో చూపిస్తాడో అని తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics