Adipurush - కన్నడ సూపర్ స్టార్ ఎంట్రీ?

Saturday,May 08,2021 - 03:16 by Z_CLU

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న భారీ సినిమాలకు ఒక్కో భాష నుండి ఒక్కో స్టార్ ని తీసుకుంటూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా విషయంలో కూడా అదే జరుగుతుంది. రామాయణంలోని ముఖ్య ఘట్టాలతో మోషన్ క్యాప్చర్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా రావణాసురుడు పాత్రలో సైఫ్ ఆలీఖాన్ కనిపించనున్నాడు. ఇక సీత పాత్రకు ఇటివలే కృతి సనన్ ని తీసుకున్నారు. అయితే సినిమాలో చాలా ఇంపార్టెన్స్ రోల్స్ ఉండటంతో మిగతా వారిని కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్.

Pailwaan Movie Sudeep HD Images

Pailwaan Movie Sudeep HD Images

తాజాగా ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం కన్నడ సూపర్ స్టార్ సుదీప్ ని తీసుకున్నారని సమాచారం. తెలుగు నుండి ప్రభాస్ హిందీ నుండి సైఫ్ – కృతి , ఇప్పుడు కన్నడ నుండి సుదీప్ ఇలా ఒక్కో లాంగ్వేజ్ కి చెందిన నటీ నటులతో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు.

కన్నడలో సుదీప్ కి ఎలాగో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి అక్కడ కూడా ఈ ప్రాజెక్ట్ పై బజ్ తీసుకురావాలని చూస్తున్నారట. అయితే సుదీప్ ని ఇందులో ఏ పాత్రకు తీసుకోబోతున్నరనేది మాత్రం బయటికి రాలేదు. మరికొన్ని రోజుల్లో అతను చేయబోయే పాత్రను చెప్తూ సుదీప్ కి వెల్కం చెప్పనున్నారు.

ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతోంది ఆది పురుష్. ఇటివలే ముంబైలో ఒక షెడ్యుల్ పూర్తి చేశారు. ప్రస్తుతం ముంబైలో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నందున నెక్స్ట్ షెడ్యుల్ ని హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో షెడ్యుల్ కోసం భారీ సెట్ వేయనుబోతున్నారని తెలుస్తుంది. వచ్చే ఏడాది సినిమాను థియేటర్స్ లోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. మరి ఈ భారీ బడ్జెట్ సినిమా అనుకున్న టైంకి పూర్తయి ప్రేక్షకుల ముందుకు వస్తుందా ? చూడాలి.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics