Kamal Haasan’s Vikram - రిలీజ్ డేట్ ఇదే

Tuesday,March 15,2022 - 11:40 by Z_CLU

Kamal Haasan’s Vikram Movie Releasing Worldwide On June 3rd

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో అత్యంత భారీ అంచనాల తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ `విక్రమ్`. ఆసక్తికరమైన ప్రచారంతో ఈ చిత్రం అంచనాలను పెంచింది. విడుదల తేదీ తో పాటు మేకింగ్ గ్లింప్స్ ని కూడా మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

“విక్రమ్ జూన్ 3న థియేటర్లలోకి రానున్నాడు. జూన్ 3, 2022న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే మా “విక్రమ్” కోసం నేనూ ఆతృతగా ఎదురుచూస్తున్నాను. #VikramFromJune3 ,” అని కమల్ హాసన్ ప్రకటించారు.

కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ త్రయాన్ని శక్తివంతమైన పాత్రలలో చూపించే మేకింగ్ వీడియోను కూడా వారు ఆవిష్కరించారు. అనిరుధ్ రవిచంద్రన్ తన బీజీఎంతో వీడియోకు మంచి థ్రిల్ ఫీల్ తీసుకొచ్చాడు.

విజయ్ సేతుపతి మెయిన్ విలన్ గా నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఆర్ మహేంద్రన్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కొన్నాళ్లుగా సరైన విజయాన్ని అందుకోలేకపోతున్నాడు కమల్ హాసన్. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆశించిన కమర్షియల్ సక్సెస్ రావడం లేదు. ఈ నేపథ్యంలో లోకేష్ దర్శకత్వంలో పూర్తిస్థాయి యాక్షన్ సినిమా చేశాడు కమల్. ఈ సినిమా సక్సెస్ అయితే, ఆల్రెడీ పెండింగ్ లో ఉన్న ఇతర సినిమాల్ని సెట్స్ పైకి తీసుకురావాలనుకుంటున్నాడు ఈ లోకనాయకుడు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics