God Father సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఇచ్చాడు

Monday,March 14,2022 - 04:03 by Z_CLU

Salman Khan joins Chiranjeevi’s ‘God Father’ shoot in mumbai

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ ముంబైలో జరుగుతుంది. సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ఓ కీ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరు , సల్మాన్ లపై ఓ యాక్షన్ ఎప్సిసోడ్ షూట్ చేస్తున్నారు. మలయాళ బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పృథ్వీ రాజ్ చేసిన పాత్రలో మెగాస్టార్ కి మెగా సపోర్టర్ గా కనిపించనున్నాడు సల్మాన్ ఖాన్. ముంబైలో ఓ స్టూడియోలో ఈ షెడ్యుల్ కోసం భారీ సెట్ డిజైన్ చేశారు. అందులోనే ఫైట్ మాస్టర్ అనల్ అరుసు కంపోజ్ చేసిన భారీ యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నారు యూనిట్.

ఇటివలే హైదరాబాద్ లో కొంత పార్ట్ షూట్ చేసుకున్న ఈ సినిమా ముంబై షెడ్యుల్ తో దాదాపు షూటింగ్ పూర్తి చేసుకోనుంది. మిగిలిన బ్యాలెన్స్ వర్క్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసే ప్రాసెస్ లో ఉన్నారు. ముందు నుండి మేకర్స్ చెప్తున్నట్లే సినిమాను ఈ ఏడాదిలోనే థియేటర్స్ లోకి తీసుకురాబోతున్నారు. షూటింగ్ అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫాస్ట్ గా ఫినిష్ చేసి దసరా లేదా దీపావళి కి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

chiranjeevi godfather

ఫర్ ది ఫస్ట్ టైం చిరు , సల్మాన్ ఖాన్ కలిసి స్క్రీన్ పై కనిపించబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఒరిజినల్ తో పోలిస్తే తెలుగు వర్షన్ లో చాలానే మార్పులు చేశారని తెలుస్తుంది. నాయన తార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ , కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బేనర్స్ పై ఆర్ .బి.చౌదరి సమర్పణలో ఎన్ వి ప్రసాద్ , రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

 

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics