Macherla Niyojakavargam - షూటింగ్ అప్ డేట్స్

Tuesday,March 15,2022 - 11:47 by Z_CLU

Nithiin’s Macherla Niyojakavargam Completes A Lengthy Schedule

ప్రస్తుతం హీరో నితిన్ చేస్తున్న సినిమా మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమా షూటింగ్‌ లో బిజీగా ఉన్నాడు ఈ హీరో. ప్రముఖ ఎడిటర్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్‌ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం భారీ షెడ్యూల్‌ ను పూర్తి చేసుకుంది. అనల్ అరసు మాస్టర్ పర్యవేక్షణలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను రూపొందించారు, ఆ తర్వాత జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన మాస్ డ్యాన్స్ పూర్తయింది. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ వివరాలు త్వరలో రాబోతున్నాయి.

Nithiin Macherla Niyojakavargam movie 1

తాజా షెడ్యూల్ పై సోషల్ మీడియాలో నితిన్ స్పందించాడు. “అనల్ అరసు మాస్టర్ కంపోజ్ చేసిన అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. జానీ మాస్టర్ సాంగ్ కంప్లీట్ అయింది. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ వివరాలు త్వరలో రాబోతున్నాయి.” అంటూ ట్వీట్ చేశాడు.

సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, క్యాథరీన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. నితిన్‌ తో ఈ ఇద్దరు హీరోయిన్లకు ఇదే ఫస్ట్ టైమ్.

పొలిటికల్ ఎలిమెంట్స్‌ తో పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో భారీ తారాగణం కూడా ఉంది. భీష్మ, మాస్ట్రో తర్వాత మహతి స్వర సాగర్ మూడవసారి నితిన్‌ తో కలిసి పనిచేస్తున్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics