'కార్తికేయ 2' సినిమాకి కాలభైరవ

Monday,December 30,2019 - 01:13 by Z_CLU

కాల భైరవ… కీరవాణి గారి అబ్బాయి అని ముందే తెలుసు… కానీ ఆ తరవాత సింగర్ గా తనకంటూ పర్టికులర్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అంతటితో ఆగాడా..? రీసెంట్ గా రిలీజైన ‘మత్తు వదలరా’ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇదే స్పీడ్ లో ‘కార్తికేయ 2’ కి ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడు.

నిఖిల్ ‘కార్తికేయ 2’ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు కాలభైరవ. ఈ సినిమాతో పాటు ఇప్పటికే ‘కలర్ ఫోటో’, ‘ఆకాశవాణి’ సినిమాలకు సంతకం చేశాడు. కానీ ‘కార్తికేయ 2’ సంగీత దర్శకుడిగా కాలభైరవని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుందనిపిస్తుంది.

మొదటి సినిమానే అయినా ఇదీ కాలభైరవ మార్క్ అనిపించాడు ‘మత్తువదలరా’ సినిమాలో. అలాంటిది ఆల్రెడీ అంచనాలున్న ‘కార్తికేయ 2’ లో కూడా అదే స్థాయిలో ఇంప్రెస్ చేస్తాడనిపిస్తుంది. ఇవే స్టాండర్డ్స్ తో దూసుకుపోవాలి కానీ, కాలభైరవ స్టార్ మ్యూజిక్ కంపోజర్స్ లిస్టు లో చేరడానికి పెద్దగా టైమ్ పట్టదనిపిస్తుంది.